
2
కిలో బెండకాయలు రూ.
ధరల కల్పనకు చర్యలు
తీసుకుంటాం
రైతులతో మాట్లాడి కూరగాయలకు గిట్టుబాటు ధరల కల్పనకు చర్యలు తీసుకుంటాం. రైతులతో మాట్లాడి ఉద్యానశాఖాధికారులతో అనుసంధానం చేసుకుని రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించేకునేలా సౌకర్యాలు కల్పిస్తాం. – కిరణ్‌కుమార్,
మార్కెటింగ్‌శాఖ ఎ.డి., బొబ్బిలి
కష్టానికి తగ్గ ఫలితం లేదు..
బెండకాయలకు కనీస ధరలేదు. చీడపీడల నివారణ, పంట కోత, రవాణా ఖర్చులు కూడా రావడంలేదు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కె సత్యం, బెండ రైతు, చింతలవలస
రామభద్రపురం:
బెండ రైతుకు క(న)ష్టకాలం వచ్చింది. రామభద్రపురం అంతర్ రాష్ట్ర మార్కెట్‌లో కిలో బెండకాయల ధర రూ.2 పలుకుతోంది. 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయలను గరిష్టంగా రూ.30కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధరలు లేక కోత, రవాణా ఖర్చులకు తిరిగి అప్పు చేయాల్సి వస్తోందంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతుకు కష్టాలే ఎదురవుతున్నాయని, పది నెలలుగా పంటను కొనుగోలుచేసేవారి కోసం ఎదురు చూడాల్సిన గడ్డు పరిస్థితులు నెలకొ న్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి పైసా పెట్టుబడి సాయం అందక, పంటకు గిట్టుబాటు ధరలేక అప్పుల్లో కూరుకుపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. ధాన్యం నుంచి కూరగాయల వరకు ఏ పంటకూ మార్కెట్‌లో మద్దతు ధర లేదని చెబుతున్నారు. రైతులంటే కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఓటు వేసి అధికారం కట్టబెట్టిన రైతన్నకే వెన్నుపోటు పొడవడం, నష్టాల్లో ముంచడంపై గగ్గోలు పెడుతున్నారు.
కోత ఖర్చులకు అప్పుచేయాల్సిందే..
నేను 20 సెంట్ల విస్తీర్ణంలో బెండ పంట సాగుచేశాను. కాపుకొచ్చిన పంటను చూసి ఆనందించాలో, గిట్టుబాటు ధర లేక బాధపడాలో తెలియడం లేదు. పంటను మార్కెట్‌కు తెస్తే కోత, రవాణా ఖర్చులు రావడం లేదు. 10 క్రేట్లను ఆటోపై రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్‌కు తెస్తే రూ.300కు వచ్చాయి. అందులో ఆశీలు రూ.100, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు రూ.100 పోగా రూ.100లు మిగిలింది. కూలీలకు, పురుగు మందులు, ఎరువులకు అప్పు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – కటికి గంగమ్మ, బెండ రైతు, రామభద్రపురం
సాగులో ఉన్న బెండ పంట
15 కిలోల బరువున్న క్రేట్
బెండకాయల ధర గరిష్టంగా రూ.30
నష్టాల్లో బెండ రైతులు
కోత ఖర్చులు సైతం దక్కని దైన్యం

2

2

2