ఏయూక్యాంపస్: సాగర తీరానికి వచ్చే పర్యాటకుల మనసు దోచుకునే ‘ఐ లవ్ వైజాగ్’ లోగో ఇప్పుడు కళ తప్పుతోంది. టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఆకర్షణీయ గుర్తు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరింది. లోగోలోని ‘లవ్’లోని అక్షరాలు దెబ్బతినగా, ఐ, వీ, ఏ, జీ అక్షరాలు సైతం దెబ్దతిన్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా ఇక్కడ ఫొటోలు తీసుకునే ఈ ప్రదేశం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గుర్తుగా మారింది. ఒకప్పుడు వందలాది మంది పర్యాటకుల సెల్ఫీలకు వేదికగా నిలిచిన ఈ లోగో ఇప్పుడు తన రూపాన్ని కోల్పోతోంది.


