రౌడీ షీటర్ల డుమ్మా
రౌడీ షీటర్లలో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో పోలీసులు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌కు పలువురు గైర్హాజరవుతున్నారు. పలుకుబడి, డబ్బు ఉన్న రౌడీ షీటర్లు కనీసం కౌన్సెలింగ్‌కు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని చోట్ల రాకపోయినా వచ్చినట్లు రికార్డుల్లో చూపిస్తున్నట్లు సమాచారం. కొంతమంది నేతల ఒత్తిడితోనే కొందరు రౌడీ షీటర్లను కౌన్సెలింగ్‌కు పిలవడం లేదని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.


