విశాఖ విద్య: చైనాలోని షాంఘై నగర కేంద్రంగా అక్టోబర్ 25, 26 తేదీల్లో ప్రపంచ తెలుగు 10వ సాహితీ సదస్సు జరుగుతుందని లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ సదస్సును వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. చైనాలోని తెలుగు రచయితలు, పండితులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు అందరూ ప్రత్యక్షంగా కలుసుకుని తమ స్వీయ రచనలు, సాహిత్యపరమైన ప్రసంగాలు చేస్తారని వివరించారు. సొంత ఖర్చులతో సదస్సుకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు.


