నయనమనోహరం | - | Sakshi
Sakshi News home page

నయనమనోహరం

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

పోర్టు వెంకన్న నౌకా విహారం

స్వామి వారి నౌకా విహారం

డాబాగార్డెన్స్‌: పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం సాయంత్రం సాగరతీరంలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతసేవ, హోమాలు నిర్వహించిన అనంతరం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను విద్యుద్ధీపాలతో అలంకరించిన నౌకపై సాగర విహారం చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో శ్రీనివాస్‌, ప్రధానార్చకులు శ్రీనివాస జగన్నాథాచార్యులు భక్తులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా, సోమవారం ఉదయం పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం దొంగల దోపు ఉత్సవం, ధ్వజ అవరోహణంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement