వైద్య రంగంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

బీచ్‌రోడ్డు: వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను, నూతన సాంకేతికతను వైద్యులు నిరంతరం అందిపుచ్చుకోవాలని పలువురు వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలో ఒమేగా హాస్పిటల్స్‌, ఉత్తరాంధ్ర యూరాలజిస్ట్స్‌, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ‘యూరో–ఆంకాలజీ అప్‌డేట్స్‌’ సదస్సు (సీఎంఈ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమేగా హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ బి.రవిశంకర్‌ మాట్లాడుతూ.. నిరంతర వైద్య విద్య, నిపుణుల మధ్య సహకారం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. యూరో–ఆంకాలజీ రంగంలో వ్యాధుల నిర్ధారణ, ఆధునిక చికిత్సా విధానాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఒమేగా హాస్పిటల్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎం.శుభాకరరావు మాట్లాడుతూ.. ఇలాంటి శాసీ్త్రయ కార్యక్రమాల ద్వారా వైద్య రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా నిపుణులు 18 శాసీ్త్రయ పరిశోధనా పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఏపీఎంసీ అబ్జర్వర్‌ డాక్టర్‌ వినోద్‌ వాధ్వా, డాక్టర్‌ రవీంద్ర వర్మ, డాక్టర్‌ అమిత్‌ సాప్లే, డాక్టర్‌ పి.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement