నీలి సాగరంలో.. నల్లటి విషం! | - | Sakshi
Sakshi News home page

నీలి సాగరంలో.. నల్లటి విషం!

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

పచ్చని కొండలు.. నీలిరంగు సాగర జలాలు.. ప్రకృతి రమణీయత మధ్య సాగే పడవ ప్రయాణం ఎవరికై నా ఎంతో హాయినిస్తుంది. కానీ, ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం చూస్తే మాత్రం గుండె ఝల్లుమనక మానదు! ఒకవైపు సాగర పర్యావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఆకాశాన్ని కమ్మేసేలా దట్టమైన నల్లటి పొగను కక్కుతోంది ‘ఝాన్సీరాణి’ బోటు. అలాగే సామర్థ్యానికి మించి పర్యాటకులతో కిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణం సాగుతోంది. పర్యావరణం, పర్యాటకుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోర్టు, మైరెన్‌ అధికారులపై ఉందని విశాఖ వాసులు గుర్తు చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement