నాన్న ప్రోత్సాహం, ఆత్మస్థైర్యమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. చిన్నప్పటి నుంచి నా ప్రతి అడుగును గమనిస్తూ, నా అభీష్టాల మేరకు చదివించి, డాక్టర్ కావాలనే నా లక్ష్యాన్ని నెరవేర్చారు. మెడిసిన్ పూర్తి చేశాక తొలుత హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో చేరినా, నాన్న చెంతనే ఉంటే ధైర్యంగా ఉంటుందనే నమ్మకంతో ప్రస్తుతం విశాఖ విశ్వం హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ విభాగంలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను.
– శ్రీపాద వెంకట శ్రీ అలేఖ్య, డ్యూటీ మెడికల్ ఆఫీసర్, విశ్వం హాస్పటిల్స్


