గ్రీన్‌పార్క్‌లో ‘నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో’ | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌పార్క్‌లో ‘నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో’

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

డాబాగార్డెన్స్‌: నగరంలోని హోటల్‌ గ్రీన్‌పార్క్‌లో ఏర్పాటు చేసిన ‘నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో’ విశాఖ వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ వస్త్ర సంపదను ఈ ఎక్స్‌పో ఒకే వేదికపైకి తెచ్చింది. ఈ వస్త్ర ప్రదర్శన–అమ్మకం ఈ నెల 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రానున్న వివాహాది శుభకార్యాలకు సరిపోయేలా ఎన్నో రకాల కలెక్షన్లను ఇక్కడ ప్రదర్శనలో ఉంచినట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతన్నలు నేరుగా రూపొందించిన సిల్క్‌, కాటన్‌ వస్త్రాలు, డిజైనర్‌ చీరలు, బ్లౌజులు, కుర్తీలపై 50 శాతం వరకు తగ్గింపు ధరలు అందిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర పైథానీ సిల్క్‌, బెంగళూరు సిల్క్‌, కాషిదా సిల్క్‌, చందేరి, మహేశ్వరి, బలుచారి, జమ్దానీ, కాంత వర్క్‌ స్టిచ్‌ చీరలతో పాటు కాశ్మీరీ ఎంబ్రాయిడరీ, కాంజీవరం చీరలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. వీటితో పాటు దుప్పట్లు, సల్వార్‌ మెటీరియల్స్‌ కూడా లభిస్తాయన్నారు. ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement