సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వ్యవస్థలో నూతన పరిజ్ఞానంపై అవగాహన, నిర్వహణ నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్(సీవోఈఈటీ)లో ఈనెల 15 నుంచి 19 వరకూ 5 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా.. గురువారం జరిగిన సెషన్‌కు సీఎండీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐఎం విశాఖపట్నం ఆధ్వర్యంలో ఫైనాన్స్ అండ్ మేనేజిరియల్ అకౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో ఏపీ విద్యుత్ రంగానికి చెందిన ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎన్‌ఆర్‌ఈడీక్యాప్ సంస్థల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ, ఇంధన రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఎనర్జీ ట్రాన్సిషన్ నేపథ్యంలో ఉద్యోగులు నిరంతర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి ద్వారా సంస్థల పనితీరు మరింత మెరుగుపడుతుందన్నారు. ఐఐఎంవీ అధ్యాపకులు డా.వికాస్ సంగ్వాన్, డా.తమలి చక్రబర్తి ప్రోగ్రామ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ శిక్షణ అందిస్తున్నారు.
ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి


