వర్షాకాలం జాగ్రత్తలపై సమావేశం | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలం జాగ్రత్తలపై సమావేశం

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

తాటిచెట్లపాలెం: రాబోయే వర్షాకాలంలో రైల్వే అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సౌత్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌(జీఎం) సందీప్‌ మాధుర్‌ తన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే ట్రాక్‌లపైకి, ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌లపైకి వచ్చే చెట్ల కొమ్మల తొలగింపు, కత్తిరింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయాల్లేకుండా చూసుకోవాలన్నారు. భద్రతపరమైన ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేసి, తరచుగా ఫీల్డ్‌ సూపర్‌వైజర్స్‌ తనీఖీలు చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో రైళ్ల రద్దీ, పలు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్‌, గుంటూరు డివిజన్‌లకు చెందిన డివిజనల్‌ రైల్వే మేనేజర్లు, ఆయా విభాగాల ప్రిన్సిపల్‌ హెడ్స్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement