మహారాణిపేట: కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రసూతి–సీ్త్ర రోగ విజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్ (ఐయుఐ) లేబొరేటరీని శుక్రవారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన రీప్రొడక్టివ్ హెల్త్ సేవలు అందుబాటులోకి రావడం కీలక ముందడుగని తెలిపారు. తక్కువ ఖర్చుతో, సురక్షితంగా నిర్వహించగల ఐయుఐ విధానం ద్వారా గర్భధారణ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ల్యాబ్‌కు అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (అంకోశా) విరాళంగా అందించింది. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తదితరులు పాల్గొన్నారు.


