సీతంపేట: నగరంలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి 26వ వార్డులోని ఓ అపార్ట్‌మెంట్ సన్‌షేడ్ కూలింది. ఎన్‌జీజీవోస్ కాలనీ ఐఓసీ పెట్రోల్ బంక్ రోడ్డులోని డోర్ నంబర్ 49–48–6/ఏలో గల వశిష్ట ఎంక్లేవ్ మూడు, నాలుగో అంతస్తుల కిటికీలపై గల సన్‌షేడ్ నానిపోయి పెచ్చులు పక్క బిల్డింగ్‌లోని కాంపౌండ్ ఏరియాలో స్కూటర్లు, కార్లు పార్కింగ్ చేసుకునే ఏరియాలో పడ్డాయి.
అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మిగతావి కూడా పెద్ద పెద్ద ముక్కలుగా పడిపోయే ప్రమాదముందని, అపార్ట్‌మెంట్ యాజమాన్యం వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.


