రాజకీయాలు! | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలు!

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

సచివాలయాల్లో
సచివాలయాలను మహానాడు వేదికలుగా మార్చేసిన టీడీపీ నేతలు ప్రజలకు పట్టం కట్టాల్సిన చోట పసుపు జెండాల మయం సామాజిక భవనాల్లోనూ మహానాడు సచివాలయాల సేవలకు రెండు రోజులు అనధికారిక సెలవులు టీడీపీ దౌర్జన్యాలకు పూర్తిగా సహకరిస్తున్న అధికారులు

భుత్వ సేవలు ప్రజల చెంతకు చేరేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆవిర్భవించిన ప్రజాసేవాలయాలు సచివాలయాలు. అలాంటి సేవాలయాలు నేడు ‘పచ్చ పార్టీ’రాజకీయాలకు వేదికలుగా మారాయి. విశాఖలో ‘మహానాడు’పేరుతో జరుగుతున్న ‘పచ్చ’తంతు చూస్తుంటే.. అసలు ఇక్కడ నడుస్తోంది ప్రజా ప్రభుత్వమా? లేక పచ్చ ముఠా రాజ్యమా? అనే అనుమానం కలగక మానదు. సచివాలయాలతో పాటు జీవీఎంసీ సామాజిక భవనాలనీ వదల్లేదు. మహానాడు నిర్వహణ వేదికలుగా మార్చేశారు. ఈ అడ్డగోలు వ్యవహారాలను నిలువరించాల్సిన అధికారులు.. తెలుగు తమ్ముళ్లకు సాగిలపడటం చూసి.. జనాగ్రహం పెల్లుబుకుతోంది.

సాక్షి, విశాఖపట్నం: మహానాడు నిర్వహణ పేరుతో విశాఖలోని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎంతో పవిత్రంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా నిలిచిన సచివాలయాలను తమ సొంత పార్టీ కార్యాలయాలుగా మార్చేశారు. సచివాలయ భవనాలపై ప్రభుత్వ చిహ్నాల స్థానంలో పసుపు జెండాలు ఎగరేశారు. అధికార గర్వంతో మహానాడు వేదికలుగా మార్చారు. ప్రజలకు పట్టం కట్టాల్సిన చోట, తమ రాజకీయ ఉనికిని చాటుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను సైతం దుర్వినియోగం చేస్తూ బరితెగించి ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ‘మేం అధికారంలోకి వస్తే వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాం’అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అండ్‌ కో.. ఇప్పుడు అదే వ్యవస్థల గొంతు నులిమి తమ రాజకీయ పబ్బానికి వాడుకుంటున్నారు.

సామాజిక భవనాల్లోనూ అదే తంతు.!

కేవలం సచివాలయాల్లోనే కాదు.. ప్రభుత్వ సామాజిక భవనాల్నీ టీడీపీ నేతలు తమ పార్టీ కార్యక్రమానికి విచ్చలవిడిగా వాడేశారు. 45వ వార్డులోని జీవీఎంసీకి చెందిన వైఎస్సార్‌ కమ్యూనిటీ హాల్‌, 47, 48 వార్డుల పరిధిలోని నీలకంఠ నగర్‌ కమ్యూనిటీ హాల్‌, 46వ వార్డులోని కమ్యూనిటీ హాల్‌, 51వ వార్డులోని వుడా కాలనీ కమ్యూనిటీ హాల్‌, 25వ వార్డులోని యాదవ సంఘం కమ్యూనిటీహాల్‌.. ఇలా.. దొరికిన ప్రతి ప్రభుత్వ భవనాన్ని పార్టీ భవనంగా రెండు రోజుల పాటు దర్జాగా వాడుకునేందుకు ఆక్రమించేశారు.

రెండు రోజులు అనధికార సెలవులు?

ప్రజా సేవల్ని అందించాల్సిన సచివాలయాల్లో మహానాడు నిర్వహిస్తుంటే.. సిబ్బంది అక్కడ ఉండాలో.. ఉండకూడదో తెలియక వెళ్లిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరైనా పింఛను దరఖాస్తు, రేషన్‌ కార్డు, ఇలా.. ఏదైనా సమస్య కోసం వస్తుంటే అక్కడ ఉన్న టీడీపీ నేతలే రెండు రోజుల పాటు సచివాలయానికి సెలవులిచ్చేశామంటూ చెప్పడం గమనార్హం. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం, ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం, అత్యవసర పనుల కోసం సచివాలయాలకు వచ్చే సామాన్య ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టి వెనక్కి పంపించేస్తున్నారు.

అధికారులేం చేస్తున్నారో.?

మహానాడు హడావుడి కోసం సచివాలయ సేవలకు ఏకంగా రెండు రోజుల పాటు ‘అనధికారిక’సెలవులు ప్రకటించారంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాసేవలను గాలికొదిలేసి, అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తడమే పనిగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భవనాల్ని పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం తప్పని.. దీనికి శిక్షలుంటాయని తెలిసినా.. అధికారులు మాత్రం.. చూసీ చూడనట్లుగా వదిలెయ్యడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార బలంతో సాగుతున్న ఈ పసుపు దండయాత్రపై విశాఖ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర

ప్రశ్నిస్తే అరెస్టులే..!

కంచరపాలెంలోని కస్తూరీనగర్‌ సచివాలయాన్ని పూర్తిగా టీడీపీ కార్యాలయంగా మార్చేశారు. మెట్లు, భవనం, సచివాలయ సిబ్బంది కూర్చునే ప్రదేశం.. ఇలా ప్రతి ఒక్క ప్రాంతంలోనూ టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టేసి.. మహానాడు నిర్వహించారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని.. ప్రభుత్వ భవనాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడమేంటంటూ ప్రశ్నించేందుకు స్థానికులు వెళ్లారు. టీడీపీ నేతల వ్యవహారశైలిని తప్పుపడుతూ.. ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అధికార జులుం ప్రదర్శించారు. డిప్యూటీ మేయర్‌ కట్టుమూరి సతీష్‌తో పాటు పలువురు నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భవనాల్లో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా.. ప్రశ్నించిన వారిని అరెస్టు చెయ్యడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement