మహారాణిపేట: గిరిజన ప్రాంతాల్లోని సికల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 3.77 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి–కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా నవజాతి శిశువులకు పుట్టిన 24 గంటలకే రక్త పరీక్షలు చేసే విధానాన్ని కేజీహెచ్‌లోనే ప్రారంభించామన్నారు.


