ఆరిలోవ: 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తరాంధ్ర శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎన్‌ఏడీలోని శ్రీచైతన్య పాఠశాలలో చదివిన కె.జ్ఞానేశ్వరి 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి టాపర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. ఆమెతో పాటు ఇప్పిలి సాద్విక, ఈదుబిల్లి తుషిక 598 మార్కులు చొప్పున సాధించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరిని విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సీమ, స్కూల్స్ ఉత్తరాంధ్ర ఏజీఎం వి.సురేష్, రీజనల్ ఇన్‌చార్జిలు అలీ, శ్రీనివాస్, గోపీనాథరావు, రామునాయుడు, ప్రసాద్, అకడమిక్ కోఆర్డినేటర్లు రాజేష్, అర్జున్, రామారావు, పట్నాయక్ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా అకడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ.. తమ విద్యాసంస్థల నుంచి 68 మంది విద్యార్థులు 595 కంటే ఎక్కువ మార్కులు సాధించారని, మరో 316 మంది 590 కంటే ఎక్కువ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని తెలిపారు.
తుషిక (598)


