కంచరపాలెం: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఆర్పీపేట ఉన్నత పాఠశాల విద్యార్థిని కత్తిరి లోహిత ప్రతిభ కనబరిచింది. మొత్తం 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా తాను కష్టపడి చదివినట్లు లోహిత తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన విజయానికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉందని పేర్కొంది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థుల కోసం ‘సాక్షి’ దినపత్రిక అందించిన సైన్స్, మ్యాథ్స్ మెటీరియల్ పరీక్షల సమయంలో తనకు ఎంతగానో ఉపయోగపడిందని కృతజ్ఞతలు తెలిపింది.


