సాక్షి, విశాఖపట్నం : జర్నలిస్టు ముసుగులో మహిళలను కించపరుస్తూ ఏబీఎన్ చానల్‌లో రోత వ్యాఖ్యతలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు అందించారు. మహిళలను దారుణంగా కించపరిచిన రాధాకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన చానల్‌లో, పత్రికలో సాగిస్తున్న ‘చెత్త పలుకు’లపై తీవ్రంగా మండిపడ్డారు.
● భీమిలి: భీమిలి వన్‌టౌన్, పద్మనాభం, ఆనందపురం పోలీస్‌స్టేషన్లలో రాధాకృష్ణపై కేసు నమోదు చెయ్యాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● విశాఖ తూర్పు: ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.
● విశాఖ దక్షిణ: మహరాణిపేట, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.
● విశాఖ ఉత్తర: ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనూ పార్టీ సమన్వయకర్త కె.కె.రాజు సూచన మేరకు ఆ పార్టీ నేతలు రాధాకృష్ణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.
● గాజువాక: దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
● విశాఖ పశ్చిమ: మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.


