మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే | - | Sakshi
Sakshi News home page

మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

విశాఖలో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ కార్యాలయం ఎదుట భారీ నిరసన

మహిళలను కించపరిచే రాతలు

వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

పోలీసుల అడ్డంకుల మధ్య కొనసాగిన

శాంతియుత ఆందోళన

● ‘చెత్తపలుకు’పై జనాగ్రహం

మహారాణిపేట: జర్నలిజం విలువలను తుంగలో తొక్కి, బ్రోకరిజమే వృత్తిగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. ‘కొత్త పలుకులు’ పేరుతో ఆయన రాస్తున్న ‘చెత్త పలుకులు’ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ నగరంలోని ఆంధ్ర జ్యోతి కార్యాలయాన్ని పార్టీ నేతలు బుధవారం ముట్టడించారు. పార్టీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్‌ జంక్షన్‌ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ కార్యాలయం వైపు దూసుకువెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ, నేతలు రహదారిపై బైఠాయించి రాధాకృష్ణ వైఖరిని ఎండగట్టారు. రాధాకృష్ణ తన రాతల ద్వారా మహిళలను కించపరిచారని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు అజెండాను అమలు చేసే సాధనాలుగా మారాయని, బాబు నోటి నుంచి వచ్చే మాటలనే వీరు రాతలుగా రాస్తున్నారని ఆరోపించారు.

కార్యక్రమంలో పీఎసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రి బాలరాజు, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌గణేష్‌, తిప్పల దేవన్‌ రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, శోభా హైమవతి, మాజీ మేయర్‌ జి.హరివెంకటకుమారి, నియోజకవర్గ పరిశీలకులు కో లా గురువులు, జహీర్‌ అహ్మద్‌, చింతకాయల సన్యాసిపాత్రుడు, వీసం రామకృష్ణ, పేడాడ రమణికుమారి, పిన్నమరాజు సతీష్‌ వర్మ, కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్‌, కె.సతీష్‌, రొంగలి జగన్నాథం, కొండా రాజీవ్‌గాంధీ, పోతిన హనుమంత రావు, పి.వి.నారాయణ, తాడి జగన్నాథ రెడ్డి, కిరణ్‌ రాజు, చెన్నదాస్‌, కోరుకొండ వెంకట రత్న స్వాతి, పల్లా దుర్గారావు, గుడ్ల వెంకట రమణి రెడ్డి, మంచా నాగ మల్లేశ్వరి, దుప్పలపూడి శ్రీనివాసరావు, గొండేశి మహేశ్వర రెడ్డి, పేర్ల విజయ్‌చంద్ర, ఉరుకూటి రామ చంద్రరావు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, అనిల్‌కుమార్‌ రాజు, చెన్న జానకిరామ్‌, రవిరాజు, సేనాపతి అప్పారావు, పివి సురేష్‌, ముట్టి సునిల్‌ కుమార్‌, తుమ్మలూరు జగదేష్‌ రెడ్డి, సనపల రవీంద్ర భరత్‌, బోని శివ రామకృష్ణ, బర్కత్‌ అలీ, కర్రి రామారెడ్డి, పి.శ్రీదేవి వర్మ, మారుతీ ప్రసాద్‌, సకలభక్తుల ప్రసాదరావు, డి.మార్కండేయులు, బొండా ఉమామహేశ్వర రావు, కోడిగుడ్ల పూర్ణిమ, బిపిన్‌ కుమార్‌ జైన్‌, వావిలపల్లి ప్రసాద్‌, రెయ్యి వెంకట రమణ, కెవి శశికళ, బల్లా లక్ష్మణ్‌, మహమ్మద్‌ ఇమ్రాన్‌, ఎండీ షరీఫ్‌, శ్రీధర్‌, అల్లంపల్లి రాజబాబు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం

అసత్య ప్రచారాలు ఆయన నైజం

జర్నలిస్టుగా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన వేమూరి రాధాకృష్ణ, తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా మేము శాంతియుత నిరసనలు కొనసాగిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులపై విషప్రచారం చేయడం దారుణం. దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ అమరావతి ప్రాజెక్ట్‌ అయితే, మరోవైపు మావిగన్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి అతిపెద్ద గ్రోత్‌ కారిడార్‌గా నిలుస్తుంది. అమరావతిలో కేవలం రూ. 4 వేలకే అయ్యే పనులకు రూ. 14 వేలు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలే కనిపిస్తే, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు.

– మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్‌

కోఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement