వేమూరి రాధాకృష్ణ ఇటీవల రాసిన కథనాలు అత్యంత నీచంగా ఉన్నాయి. మహిళలను అవమానించేలా రాయడం అసహ్యకరం. వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ రాతలపై రాధాకృష్ణ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా వేదికలను ఉపయోగించుకుని సమాజంలో విభేదాలు సృష్టించడం సరికాదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి చేటు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆంధ్రజ్యోతి పత్రికలోనే క్షమాపణ చెబుతూ స్పష్టమైన వివరణ ప్రచురించాలి.
– మాజీ ఉపముఖ్యమంత్రి
బూడి ముత్యాలనాయుడు


