మహారాణిపేట : కేజీహెచ్‌లో రోగులు, వారి సహాయకులకు భోజనం అందించడానికి ఇండో ఎంఐఎం సంస్థ ముందుకు వచ్చింది. తమ సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.40 లక్షల చెక్కును టచ్ స్టోన్ చారిటీస్, హరే కృష్ణ మూవ్‌మెంట్ అందజేశారు. సుభోజనం కింద కేజీహెచ్‌లో ఏడాది పాటు రోగులు, వారి సహాయకులకు రెండు పూటలా భోజనం, అల్పాహారం ఇవ్వడం కోసం సహాయం చేశారు. కార్యక్రమంలో ఇండో ఎంఐఎం ప్రతినిధి విజయ్ గోవింద్, టచ్‌స్టోన్ చారిటీస్ ప్రతినిధి గోపేశ్వర దాస పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ గోవింద్ టచ్‌స్టోన్ చారిటీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.


