కేజీహెచ్‌లో ఏఆర్‌టీ సరోగసీ బృందం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో ఏఆర్‌టీ సరోగసీ బృందం తనిఖీ

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

మహారాణిపేట : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్‌ పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఏఆర్‌టీ, సరోగసీ బృందం సోమవారం కేజీహెచ్‌లో గైనిక్‌ విభాగాన్ని తనిఖీ చేశారు. ఏఆర్‌టీ లెవెల్‌–1 కేంద్రం నిర్వహణకు వైద్యులు, స్టాఫ్‌ విద్యార్హతలు, ల్యాబ్‌ పరికరాలు పరిశీలించి తగు సూచనలు చేశారు. త్వరలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం రాబోతోంది. దాని కోసం డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో ఏడుగురు సభ్యుల బృందం తనిఖీ చేశారు. కలెక్టర్‌ అనుమతులు పొందిన తర్వాత ఉచితంగా సేవలు అందిస్తారు. దీనికి అవసరమైన పరికరాలను ఏఎంసీ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (అంకోశా) సమకూర్చారని కేజీహెచ్‌ గైనిక్‌ విభాగాధిపతి(హెచ్‌వోడీ) డాక్టర్‌ సౌమిని తెలిపారు. ఈ తనిఖీ బృందంలో డాక్టర్‌ విద్యారమ(గైనకాలజిస్ట్‌) డాక్టర్‌ వందన శశికిరణ్‌ (రేడియోలజిస్ట్‌), డాక్టర్‌ టి.కిషోర్‌(పెథాలజిస్ట్‌) డాక్టర్‌ శోభశ్రీ (సోషియాలజిస్ట్‌, ఆంధ్రా యూనివర్సిటీ), శ్రీమతి ఎల్‌.వి.రమణి(ఎన్‌జీవో, గాయత్రి వెల్ఫేర్‌) నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.ఉమావతి, జిల్లా మీడియా విస్తరణాధికారి(డీమో) బి.నాగేశ్వరరావు, మానటరింగ్‌ కన్సెల్టెంట్‌ కె.శివాజీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement