ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాలు.. జీవీఎంసీ ఎనిమిదో వార్డు పరిధి ఎండాడ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఆరిలోవ పోలీసులకు స్థానికుల ద్వారా సమాచారం అందింది. దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి వయసు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. వివరాలు తెలిసినవారు ఆరిలోవ పోలీసులను సంప్రదించాలని సూచించారు.


