బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆశయ సాధనే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆశయ సాధనే ధ్యేయం

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

మహారాణిపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తిప్పల దేవాన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం జగ్జీవన్‌ రామ్‌ ఆశయాలకు అనుగుణంగా సాగాయని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, సతీష్‌వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కిరణ్‌ రాజు, తాడి జగన్నాథరెడ్డి, వెంకట రమణి, రాష్ట్ర పార్టీ అనుబందం విభాగలు అధ్యక్షుడు పేర్ల విజయ్‌ చందర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవాస్తవ్‌, జోనల్‌ , జిల్లా పార్టీ అనుబందం విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్‌, పీవీ సురేష్‌, ఎం. సునీల్‌ కుమార్‌, తుమ్మలూరు జగదేష్‌ రెడ్డి, సనపల రవీంద్ర భరత్‌, శ్రీ దేవి వర్మ, బోని శివ రామకృష్ణ, కర్రి రామారెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్‌, జీలకర్ర నాగేంద్ర, దేవరకొండ మార్కెండేయులు, మాజీ కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, బిపిన్‌ కుమార్‌ జైన్‌, వావిలపల్లి ప్రసాద్‌, రెయ్యి వెంకట రమణ, కేవీఎన్‌ శశికళ, మాజీ చైర్మన్లు అలంపల్లి రాజబాబు, పార్టీ నాయుకులు రామన్నపాత్రుడు, తుళ్లి చంద్ర శేఖర్‌, ఈశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయంలో నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement