మేము కొన్ని దశాబ్దాలుగా జోడుగుళ్లుపాలెంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకుని, ఇక్కడ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా పొట్టకూటి కోసం కేటాయించుకున్న ఈ స్థలంలోనే ఇప్పుడు బీజేపీ నాయకులు జెండాను ఆవిష్కరించడం మాకు తీరని అన్యాయం. మిగిలిన స్థలంలో వాజ్‌పేయి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామంటున్నారని తెలిసింది.. అదే జరిగితే మా ఆటోలు ఎక్కడ నిలుపుకోవాలి? మా జీవనోపాధిని దెబ్బతీసే ఇలాంటి చర్యలను అస్సలు సహించం. ఇక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను వెంటనే తొలగించాలి. మాకు న్యాయం జరిగే వరకు ఆటో డ్రైవర్లమంతా ఏకమై పోరాటం చేస్తాం.
–దాస్, ఆటో యూనియన్ అధ్యక్షుడు, జోడుగుళ్లుపాలెం


