తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు.
● ఎర్నాకుళం జంక్షన్–ముజఫర్‌పూర్ (06085) వీక్లీ స్పెషల్ ఈ నెల 10, 17, 24 తేదీల్లో (ప్రతి శుక్రవారం) రాత్రి 9.30 గంటలకు ఎర్నాకుళం జంక్షన్‌లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.05 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి రాత్రి 11.07 గంటలకు బయల్దేరి నాల్గో రోజు ఉదయం 7.30 గంటలకు ముజఫర్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముజఫర్‌పూర్–ఎర్నాకుళం జంక్షన్(06086) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 13, 20, 27 తేదీల్లో (ప్రతి సోమవారం) రాత్రి 9.15 గంంటలకు ముజఫర్‌పూర్‌లో బయల్దేరి బుధవారం తెల్లవారు 2.40 గంటలకు దువ్వాడ చేరుకొని, అక్కడి నుంచి 2.42 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 10.45 గంటలకు ఎర్నాకుళం జంక్షన్ చేరుకుంటుంది.
● ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–బరౌని (06039) వీక్లీ స్పెషల్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్‌లో ఈ నెల 12,19,26 తేదీల్లో (ప్రతి ఆదివారం) రాత్రి 11.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు దువ్వాడ చేరుకొని, అక్కడి నుంచి 2.52 గంటలకు బయల్దేరి మంగళవారం రాత్రి 8 గంటలకు బరౌని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బరౌని–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (06040) వీక్లీ స్పెషల్ ఈ నెల 15, 22, 29 తేదీల్లో (బుధవారం) రాత్రి 9 గంటలకు బయల్దేరి శుక్రవారాల్లో తెల్లవారు 2.32 గంటలకు దువ్వాడ చేరుకొని, అక్కడి నుంచి 2.35 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ చేరుకుంటుంది.


