తాటిచెట్లపాలెం: వేసవి సీజన్ ప్రారంభమైన వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
● ప్రతి మంగళవారం బయలుదేరే విశాఖపట్నం–షాలిమర్(08508) స్పెషల్ రైలును జూన్ 30 వరకు, షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్‌ను జూలై 1వ తేదీ వరకు పొడిగించారు.
● దువ్వాడ మీదుగా ప్రయాణించే సంబల్‌పూర్–ఈరోడ్(08311) వీక్లీ స్పెషల్‌ను మే 27వ తేదీ వరకు, ఈరోడ్–సంబల్‌పూర్ (08312) వీక్లీ స్పెషల్‌ను మే 29వ తేదీ వరకు పొడిగించారు.
● దువ్వాడ మీదుగా ప్రయాణించే భువనేశ్వర్–యశ్వంత్‌పూర్(02811) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూన్ 27వ తేదీ వరకు, యశ్వంత్‌పూర్–భువనేశ్వర్ (02812) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూన్ 29వ తేదీ వరకు పొడిగించారు. ● విజయనగరం మీదుగా ప్రయాణించే యశ్వంత్‌పూర్–కతిహార్(06571) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూలై 14వ తేదీ వరకు, కతిహార్–యశ్వంత్‌పూర్ (06572) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు.
● దువ్వాడ మీదుగా ప్రయాణించే ఎస్‌ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్(06565) స్పెషల్ రైలును జూలై 12వతేదీ వరకు,మాల్డా టౌన్– ఎస్‌ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్‌ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు.


