నేడు టిడ్కో గృహప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

నేడు టిడ్కో గృహప్రవేశాలు

Mar 30 2026 7:20 AM | Updated on Mar 30 2026 7:20 AM

మహారాణిపేట: జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ పట్టణ నివాస సముదాయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో సోమవారం గృహాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.323 కోట్ల వ్యయంతో నిర్మించిన 3,600 పైగా గృహాలను ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు అప్పగిస్తామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కొమ్మాది వద్ద రూ.30.55 కోట్లతో నిర్మించిన 336 ఇళ్లు, మంత్రిపాలెం వద్ద రూ.33.60 కోట్లతో నిర్మించిన 336 ఇళ్లు, తలారివానిపాలెం, దువ్వాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లో రూ.253.88 కోట్ల వ్యయంతో నిర్మించిన 2,928 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని టిడ్కో ఈఈ సుధాకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement