ప్రస్తుత కలెక్టర్ హరేందిర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ
మహారాణిపేట: జిల్లా కలెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముత్తంబకు అభిషిక్త్ కిషోర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను విశాఖ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌ను కాకినాడ జిల్లాకు బదిలీ చేశారు. నూతన కలెక్టర్ కిషోర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
హరేందిర ప్రసాద్ సేవలు
22 నెలల పాటు కలెక్టర్‌గా హరేందిర ప్రసాద్ విశేష సేవలు అందించారు. 2024 జూలై 23న బాధ్యతలు చేపట్టిన ఆయన, తన పదవీ కాలంలో ఐఎఫ్‌ఆర్, మిలాన్ వంటి అంతర్జాతీయ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అలాగే నీతి ఆయోగ్ జాతీయ సదస్సు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వీవీఐపీల పర్యటనలను సమర్థవంతంగా పర్యవేక్షించారు. సుమారు మూడు రోజుల పాటు జరిగిన భాగస్వామ్య సదస్సును కూడా ఆయన విజయవంతం చేశారు.
అభిషిక్త్ కిషోర్ ప్రస్థానం
నూతన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ నెల్లూరు జిల్లాకు చెందిన వారు. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన, తన కెరీర్‌ను వెస్ట్ గోదావరి అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత చింతూరు ఐటీడీఏ పీడీగా, కర్నూలు, రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్‌గా, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.
హరేందిర ప్రసాద్
అభిషిక్త్ కిషోర్


