62 కేసుల్లో 54 మంది నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

62 కేసుల్లో 54 మంది నిందితుల అరెస్ట్‌

Mar 26 2026 7:16 AM | Updated on Mar 26 2026 7:16 AM

● 1.79 కేజీల బంగారం, 6.14 కేజీల వెండి స్వాధీనం ● మొత్తంగా రూ.1.12 కోట్లు విలువ సొత్తు రికవరీ

విశాఖ సిటీ: నగరంలో నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రతబాగ్చి పేర్కొన్నారు. బుధవారం పోలీస్‌ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఫిబ్రవరి నెలలో నగరంలో 62 చోరీ కేసులు నమోదవగా అన్నింటినీ ఛేదించినట్లు తెలిపారు. ఇందులో 54 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.7,57,500 నగదు, 1.79 కేజీల బంగారం, 6.14 కేజీల వెండి, 9 బైక్‌లు, 3 ఆటోలు, ఒక వ్యాన్‌, 303 మొబైల్‌ ఫోన్లు, ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రూ.1,12,01,598 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. నేర నియంత్రణలో భాగంగా జూలైలో నగరంలో 239 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రి, పగలు ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం బాధితులు పొగొట్టుకున్న సొత్తును సీపీ తన చేతుల మీదుగా వారికి అందజేశారు. సమావేశంలో డీసీపీ(కై మ్‌) లతామాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement