సింహాచలం: ఏప్రిల్ 20న జరిగే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 మార్గాలను పరిశీలించి భక్తులకు తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉచిత దర్శనంలో వచ్చే భక్తులకు రెండు మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. క్యూలైన్లలో మంచినీరు, వాష్‌రూమ్స్, ఎమెర్జన్సీ ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తర రాజగోపురం నుంచి అన్నదానం భవనానికి వెళ్లే మార్గాలను సీపీ పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొండపై బస్ కాంప్లెక్స్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింహగింపై పార్కింగ్ ఏరియా తక్కువగా ఉండటంతో ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


