కొల్లాగొడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

కొల్లాగొడుతున్నారు

Mar 27 2026 9:48 AM | Updated on Mar 27 2026 9:48 AM

అక్రమ మైనింగ్‌ (మిగతా 2వ పేజీలో)

చింతలూరు కొండలను
నిరుద్యోగులకు టోపీ నుంచి మైనింగ్‌ మాఫియా వరకు అక్రమాల ఘనుడు
గుంటూరు నుంచి వచ్చి చక్రం తిప్పుతున్న టీడీపీ నేత అక్రమంగా రాత్రి సమయాల్లో గ్రానైట్‌ బ్లాక్‌ల తరలింపు మైనింగ్‌ విజిలెన్స్‌లో అక్రమాలు బట్టబయలు కొమ్ము కాస్తున్న స్థానిక మైనింగ్‌ అధికారులు అక్రమ మైనింగ్‌ జరగలేదంటూ తప్పుడు నివేదికలు

చింతలూరులో

చంద్రబాబు ప్రభుత్వం రాకతో జిల్లాలో అక్రమాల గ(ఘ)నులు చెలరేగిపోతున్నారు. టీడీపీ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అధికారులు తాళం వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గతంలో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత అజయ్‌ కొల్లా తాజాగా జిల్లాలో మైనింగ్‌ డాన్‌గా అవతారమెత్తాడు. గ్రానైట్‌ బ్లాక్‌ల అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. స్థానిక మైనింగ్‌ అధికారులు కొమ్ము కాస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

ర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చింతలూరు నుంచి అక్రమంగా గ్రానైట్‌ బ్లాక్‌లను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి మరీ వ్యవహారం నడుపుతున్న సదరు టీడీపీ నేత ఆడిందే ఆట... పాడిందే పాటగా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో ఐటీ కంపెనీ పెట్టి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి అరెస్టయిన చరిత్ర కలిగిన సదరు నేత చంద్రబాబు, లోకేష్‌లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నట్టు విమర్శలున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా భారీ గ్రానైట్‌ బ్లాక్‌లను అడ్డంగా తరలిస్తూ రూ.10 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్‌ జరుపుతున్నారని, పర్మిట్లు లేకుండానే గ్రానైట్‌ బ్లాక్‌లను తరలిస్తున్నారంటూ దీనిపై ఇప్పటికే విజిలెన్స్‌ అధికారులు తమ తనిఖీల ద్వారా తేల్చారు. అయితే స్థానిక మైనింగ్‌ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలోని బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం.

మైనింగ్‌ పర్మిట్లు లేకుండానే...!

వాస్తవానికి ఏదైనా క్వారీ మైనింగ్‌ జరపాలంటే పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర మైనింగ్‌ చేస్తున్నది? ఎంత మొత్తం గ్రానైట్‌ను తరలిస్తున్నారనే విషయాన్ని పేర్కొంటూ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఎటువంటి మైనింగ్‌ పర్మిట్లు లేకుండానే సుమారు రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్‌ బ్లాక్‌లను తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్లాస్టింగులు చేపడుతూ గ్రామ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా ఈ క్వారీ ఉన్న ప్రాంతానికి డీఆర్‌డీవో కూడా కూతవేటు దూరంలోనే ఉంది. రక్షణరంగ సంస్థకు సమీపంలో చేపడుతున్న ఈ బ్లాస్టింగులతో ఇబ్బందులు తప్పవనే ఆందోళన కూడా నెలకొంది. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల సామర్థ్యానికి మించి మరీ అధిక లోడుతో భారీ గ్రానైట్‌ బ్లాక్‌లను తరలిస్తున్నారు. అయినప్పటికీ అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మైనింగ్‌, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. భారీ లోడ్‌లతో ఈ విధంగా మొత్తం రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్‌ బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టు మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement