సబ్బవరం: సౌత్ జోన్ డెఫ్ క్రికెట్ చాంపియన్‌షిప్–2026 గుల్లేపల్లిలోని అవెన్యూ స్పోర్ట్స్ అరేనా క్రికెట్ మైదానంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. దక్షిణ జోన్ రాష్ట్రాల నుంచి నాలుగు జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సహకారంతో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. డ్రీమ్ షెల్టర్ చైర్మన్ రవిశంకర్, ఆర్‌ఆర్ రిసార్ట్స్ చైర్మన్ రతన్ రాజ్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ సురవరపు రామన్ సుబ్బారావు, సెక్రటరీ యడ్లపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఏసీఏ ఇలాంటి టోర్నీలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఇస్తోందని తెలిపారు. మాజీ భారత దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్, అడ్వైజర్ రమణ తదితరులు పాల్గొన్నారు.
ఉత్కంఠ పోరులో తెలంగాణదే విజయం
తొలి మ్యాచ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తెలంగాణ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 19.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం 125 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన తెలంగాణ జట్టు 19.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తెలంగాణ బ్యాటర్ టి.హరికృష్ణ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
అట్టహాసంగా ప్రారంభమైన సౌత్ జోన్ టోర్నీ


