ఇందులో ఫిజికల్, బయోలాజికల్, కెమికల్ రియాక్టివ్ ఇంటర్‌ఫేస్‌లతో కూడిన 25 నుంచి 100 వరకు సక్కర్స్(పీల్చే గొట్టాలు) ఉంటాయి. ఇవి గాలిలోని ధూళి కణాలను, హానికర రసాయన వాయువులను సమర్థవంతంగా పీల్చుకుని గాలిలోంచి తొలగిస్తాయి. గాలి స్వచ్ఛీకరణను క్షణాల వ్యవధిలోనే పూర్తి చేసి బయటకు విడుదల చేస్తుంటాయి. ఇందులో ఉండే మోడ్స్ ప్రకారం ఎంత విస్తీర్ణం మేర గాలి నాణ్యతను పెంచాలనేది సెట్ చేసుకోవచ్చు. ఈ యంత్రం ద్వారా ప్రస్తుతం దాదాపు 200 చదరపు మీటర్ల వరకూ గాలిని స్వచ్ఛీకరించవచ్చు.


