గాజువాక : పాతగాజువాక సమీపంలోని చినగంట్యాడ జంక్షన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్ల మహిళ మృతి చెందింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరమాండల్ గేటు ప్రాంతానికి చెందిన ఎం.స్వాతి (30) తన తల్లి నాగమణితో కలిసి ద్విచక్ర వాహనంపై చినగంట్యాడ వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో చినగంట్యాడ జంక్షన్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఒక భారీ ట్రాలర్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వాతి బైక్ పై నుంచి కింద పడిపోవడంతో ట్రాలర్ చక్రాలు ఆమైపె నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై గాజువాక సీఐ షేక్ హుస్సేన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


