సైనికా!
సాహో..
సరిలేరు నీకిక..
హార్ట్ బీట్ పెంచిన మార్కోస్
భారత రక్షణ శాఖ ఆయుధ సంపత్తి ప్రదర్శన అబ్బురపరిచింది. చేతక్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, కమోవ్–28, మిగ్ ఫైటర్ జెట్లు, డార్నియర్ విమానాలు ఆకాశంలో చేసిన డైమండ్ ఫార్మేషన్ విన్యాసాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కోస్ట్‌గార్డ్ విమానాలు, హైస్పీడ్ వెసెల్స్, ఆధునిక బీఎంపీ యుద్ధ ట్యాంకుల ప్రదర్శన భారత సైనిక సత్తాను చాటింది. ఇక, కమాండో ఫోర్స్ మార్కోస్ చేసిన సాహసోపేతమైన విన్యాసాలు వీక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి.
సాగర తీరాన
సాయుధ బలగాల గర్జన
ఆకట్టుకున్న మార్కోస్ సాహసాలు
కనుల పండువగా కవాతు
కట్టిపడేసిన కళారూపాలు
అట్టహాసంగా సిటీ పరేడ్
సైనికా!


