షిప్‌యార్డులో రెండో టగ్ నిర్మాణానికి శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం : హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్(హెచ్‌ఎస్‌ఎల్), విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) కోసం నిర్మిస్తున్న రెండో 60 టన్నుల బీపీ టగ్ స్టీల్ కటింగ్ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. సీఎన్‌సీ ప్లాస్మా కటింగ్ మెషీన్‌ని పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్ కె.రోషిణి అపరాంజి ప్రారంభించి ఈ నిర్మాణానికి పునాది వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 22న షిప్‌యార్డు, పోర్టు మధ్య ఒప్పందం కుదిరిన రెండు నెలల వ్యవధిలోనే పనులు ప్రారంభించడం గమనార్హమన్నారు. షిప్‌యార్డు సీఎండీ కెప్టెన్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నౌకా నిర్మాణ రంగంలో ఎంఎస్‌ఎంఈలు భాగస్వామ్యం, కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మారీటైమ్ ఇండియా విజన్–2030లో భాగంగా రూపొందిస్తున్న ఈ 32 మీటర్ల టగ్‌లు విశాఖ పోర్టులో నౌకల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా అత్యవసర సమయాల్లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పోర్టు, షిప్‌యార్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


