హాట్ కేకుల్లా టీ–20 మ్యాచ్ టికెట్లు
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో ఈనెల 28న జరగనున్న భారత్–న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టేడియంలో ప్రత్యక్షంగా 27,251మంది మ్యాచ్‌ను వీక్షించే సీటింగ్ ఏర్పాట్లు చేశారు. తొలి దశలో పదకొండు డినామినేషన్లలో స్టేడియంలోని పద్దెనిమిది స్టాండ్‌లతో పాటు కార్పొరేట్ బాక్స్‌ల టికెట్ల విక్రయాన్ని డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి విక్రయాలు ప్రారంభించారు. తొలి టికెట్‌ను విశాఖ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ కొనుగోలు చేయడంతో విక్రయాలు ప్రారంభమయ్యాయి.


