హామీల అమలు ఎక్కడ?
తాటిచెట్లపాలెం: ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వహణ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవత్సవ ఆధ్వర్యంలో మంగళవారం గురుద్వారా జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్‌మోహనరెడ్డి అందించిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, అదనంగా ‘సూపర్ సిక్స్’ పేరుతో మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా.. మహిళలకు ‘ఆడబిడ్డ నిధి’, యువతకు ‘నిరుద్యోగ భృతి’, 45 ఏళ్లు దాటిన మహిళలకు ‘పెన్షన్లు’వంటి పథకాల ఊసే లేదని విమర్శించారు. హామీల గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని, దీని వల్ల ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయ్ చంద్ర, అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, శ్రీదేవివర్మ పెనుమత్స, మార్కండేయులు, నీలి రవి, బానాల తరుణ్, బెందాళం పద్మావతి, మళ్ల ధనలత, రీసు అనురాధ, కంచర్ల శ్రీదేవి, సాలది భాను, గరికిన వెంకటేష్, జియ్యాని వెంకట సత్య, చెరుకూరి రజిని, మజ్జి జ్యోతి, బంగారమ్మ, లక్ష్మణ్, నమ్మి లక్ష్మణ్, విజయ భాస్కర్, నికిల్, దమయంతి, రాజేశ్వరి, బద్రి, సత్యవతి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
హామీల అమలు ఎక్కడ?


