రైతు కార్డ్ లేనివారికీ అవకాశం
సీజనల్ పంటలే కాకుండా మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించాలని రైతులకు సూచిస్తున్నాం. జిల్లా హార్టికల్చర్ విభాగం ఈ దిశగా పెద్ద ఎత్తున వారికి అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించి రైతు బజార్‌లలో విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలాంటి పంటలు పండించే అర్హతున్న రైతులు ఎవరైనా వారి పంటను నగర రైతు బజార్‌లలో విక్రయించుకునే అవకాశం కల్పిస్తాం. రైతు బజార్ కార్డ్‌హోల్డర్ కానప్పటికీ ఈ సేవలను వారు వినియోగించుకోవచ్చు. అవసరమైతే వారి పంటను పూర్తిస్థాయిలో పరిశీలించి వారికి రైతు బజార్‌లో విక్రయాల కోసం కార్డ్ మంజూరు చేయడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇలాంటి రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస కిరణ్,
డీడీ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ
ప్రోత్సాహానికి కృషిచేస్తున్నాం
పోషక విలువలు, అధిక ఆదాయం లభించే పంటలు పండించే దిశగా విశాఖ రైతులను నిత్యం ప్రోత్సహిస్తున్నాం. విశాఖ గ్రామీణ జిల్లాకు సంబంధించి పద్మనాభం, భీమిలి మండలాల్లో నిత్యం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆసక్తి గల రైతులు ఇంట్లో, ఇంటి ఆవరణలో కూడా కొన్ని పంటలను పండించవచ్చు. పోషక పంటలకు తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు అనుకూలం. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల అఽధికారుల సమన్వయంతో మన్యం రైతుల్లో అవగాహన పెంచే దిశగా కృషిచేస్తున్నాం. ఇలాంటి పంటలు పండించేందుకు ఆసక్తి గల రైతులను గుర్తించాలని ఇప్పటికే నగరంలోని రైతుబజార్ల ఈవోలకు సూచించడం జరిగింది. వారి నుంచి కూడా వివరాలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఇలాంటి పంటలు పండించే రైతుల ప్రోత్సాహానికి మరింత కృషి చేస్తాం.
– బి.శ్యామల, ఏడీ, జిల్లా హార్టికల్చర్ విభాగం
రైతు కార్డ్ లేనివారికీ అవకాశం


