స్టీల్‌ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా వినయ్ కుమార్
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్(ఫైనాన్స్)గా సెయిల్ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ నియమితులయ్యారు. స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్(ఫైనాన్స్) పదవీ విరమణ చేసినందున ఆ బాధ్యతలను డైరెక్టర్(కమర్షియల్) జి.వి.ఎన్.ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ బుధవారం వినయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో డీసీఆర్ శ్రీనివాసరావు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులతో పాటు పాత బకాయిలు, నీటి చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షించి, రోజుకో సచివాలయ పరిధిలోని ఇళ్లను సందర్శించి పన్నులు వసూలు చేయాలన్నారు. 98 వార్డుల్లో ఉన్న సహాయక ఇంజనీర్లు, ఎమినిటీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని పనిచేయాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. జీవీఎంసీ ఆస్తి పన్నులు చెల్లించేందుకు సీడీఎంఏ వెబ్‌సైట్ అందుబాటులో ఉన్నప్పటికీ, జీవీఎంసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. మొండి బకాయిలపై చర్యల కోసం జోనల్ కమిషనర్ స్థాయిలో జప్తు నోటీసులు ఆయా భవనాల వద్ద అతికించాలన్నారు.
జీవీఎంసీ పన్ను వసూళ్లు వేగవంతం చేయండి


