ఏయూ ‘వేవ్స్’కు సర్వం సిద్ధం
ముఖ్య అతిథిగా
ఎంపీ సుధామూర్తి
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ.. పూర్వ విద్యార్థుల వార్షిక మహా సమ్మేళనం ‘వేవ్స్–2025’నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మహిళా సాధికారత థీమ్‌తో ఈ సారి నిర్వహిస్తున్న సమ్మేళనానికి సుమారు 10వేల మంది పూర్వ విద్యా ర్థులు నమోదు చేసుకున్నారని ఏఏఏ చైర్మన్ కె.వి.వి.రావు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన వేదిక బయట ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఉదయం ఆయా విభాగాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయి. ముఖ్య అతిథి సుధామూర్తి.. ఏయూ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా ఏయూ పరిపాలన భవనం, అలుమ్ని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఏయూ అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు జి.ఎం రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు.


