విశాఖ–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు | - | Sakshi
Sakshi News home page

విశాఖ–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

Dec 13 2025 7:19 AM | Updated on Dec 13 2025 7:19 AM

విశాఖ–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

విశాఖ–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌ తెలిపారు. విశాఖపట్నం–ఎస్‌ఎంవీటీ బెంగళూరు(08501) స్పెషల్‌ ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఎస్‌ఎంవీటీ బెంగళూరు–విశాఖపట్నం (08502) స్పెషల్‌ ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు ఒక సెకండ్‌ ఏసీ, 2–థర్డ్‌ ఏసీ, 12–స్లీపర్‌క్లాస్‌, 3 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2–సెకండ్‌ క్లాస్‌ కం లగేజి కం బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌లతో నడుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement