మత్స్య రంగానికి విలువ జోడిస్తే అధిక వృద్ధి
ఏయూక్యాంపస్: మత్స్య రంగానికి విలువను జోడిస్తే అధిక వృద్ధి సాధించవచ్చని సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీ య అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ అన్నారు. బీచ్‌రోడ్డులోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్–సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శుక్రవారం ఫిషరీస్ ఇంక్యుబేషన్ సెంటర్ సంయుక్తంగా మత్స్య రంగంలో విలువ ఆధారిత సుస్థిర వ్యాపార అవకాశాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మేనేజర్లు, సూపర్‌వైజర్లకు ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఉత్పత్తులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ బి.మధుసూదనరావు.. మత్స్య, ఆక్వా కల్చర్ రంగాల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించే దిశగా ఇంక్యుబేషన్ సెంటర్ పనితీరును వివరించారు. డాక్టర్ పి.విజి, డాక్టర్ జెస్మి దేబ్ బర్మ మాట్లాడుతూ వాణిజ్యీకరణకు సిద్ధంగా ఉన్న విలువ ఆధారిత చేపల ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులను, సముద్ర నాచు వినియోగాన్ని వివరించారు. ఐసీఏఆర్–సీఐఎఫ్‌టీ అభివృద్ధి చేసిన వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు, సీ వీడ్ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.


