
నేటి నుంచి ఖాదీ సంత
ఎంవీపీకాలనీ: బీజేపీ ఆధ్వర్యంలో గురు,శుక్రవారాల్లో బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్‌హాల్ ఎదురుగా ఖాదీ సంతను నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తెలిపారు. బుధవారం లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ’ అనే నినాదంతో స్వదేశీ వస్తువుల తయారీదారులను ప్రోత్సహించడానికి ఈ సంతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంత ద్వారా చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తుల విక్రయాలకు, ప్రోత్సాహానికి అవకాశం కల్పించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.