
ఏపీఈపీడీసీఎల్‌లో పలువురికి పదోన్నతులు
తాటిచెట్లపాలెం: ఏపీఈపీడీసీఎల్‌లో పలువురు ఇంజినీర్లకు చీఫ్ జనరల్ మేనేజర్లగా పదోన్నతులు లభించాయి. ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సోలార్ ఎనర్జీ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఎల్ దైవప్రసాద్, పర్చేజెస్ అండ్ మెటీరియల్స్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఎస్ విజయ్‌ప్రతాప్‌లకు పదోన్నతులు లభించాయి. కమర్షియల్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఎస్.రాజబాబు, సీజీఆర్‌ఎఫ్ టెక్నికల్ మెంబర్‌గా బి.సులేఖ రాణిలకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌లను సీఎండీ పృఽథ్వీతేజ్ సోమవారం జారీ చేశారు. బుధవారం విశాఖపట్నం కార్పోరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఎల్.దైవప్రసాద్, బి.సులేఖరాణి, ఎస్.రాజబాబులకు పలువురు విద్యుత్ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
సులేఖరాణి
దైవప్రసాద్

ఏపీఈపీడీసీఎల్‌లో పలువురికి పదోన్నతులు