
సీఎం చంద్రబాబుకు స్వాగతం
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. విజయనగరంలో జరిగే పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన.. ట్రాన్సిట్ హాల్ట్‌లో భాగంగా బుధవారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు, సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాప్టర్‌లో విజయనగరం బయలుదేరి వెళ్లారు.