
నేడు సీఎం చంద్రబాబు రాక
ఎయిర్‌పోర్ట్‌లో సీపీ భద్రతా సమీక్ష
మహారాణిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన విజయనగరం జిల్లా, దత్తిరాజేరు మండలం, దత్తి గ్రామానికి పయనమవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తర్వాత పార్టీ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి తిరిగి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ మేరీ ప్రశాంతి, సీఐఎస్‌ఎఫ్ అధికారి నవనీత్ కౌర్‌తో పాటు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ఎయిర్‌పోర్టులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.