
రేపటి నుంచి వన్యప్రాణి వారోత్సవాలు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో గురువారం నుంచి 8 వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు క్యూరేటర్ జి. మంగమ్మ మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు, ప్రజల కోసం వివిధ పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో బర్డ్‌వాక్, ఫొటోగ్రఫీ, రేఖాచిత్ర పోటీలు, ప్రసంగ పోటీలు వంటివి ఉన్నాయి. పోటీల్లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందజేస్తారు. మరిన్ని వివరాల కోసం జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 78936 32900 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.