
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన గళం
మిగతా IIవ పేజీలో
కూటమి తీరుపై వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం మెడికల్ కళాశాలలనుప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ అంబేడ్కర్ స్మృతివనం జోలికొస్తే ఉద్యమం తప్పదు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు
డాబాగార్డెన్స్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, దళితులపై దాడులు, విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం ప్రైవేటీకరణ యత్నాలపై కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ నేతృత్వంలో నగరంలోని డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్య, వైద్యం ప్రజల హక్కు అని, వాటిని ప్రైవేటీకరించకూడదని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు కేవలం కార్పొరేట్ శక్తుల కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను దృష్టిలో ఉంచుకుని, వారి భవిష్యత్ తరాల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇవి అమల్లోకి వస్తే లక్షలాది మంది పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత మెడికల్ విద్య అందుతుందని తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం దీనికి భిన్నంగా ఈ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి యత్నించడం చాలా దుర్మార్గమని ధ్వజమెత్తారు.
● మాజీ ఎమ్మెల్యే, పార్టీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ దళితులు, పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేలా ఎస్సీ సెల్ చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. మెడికల్
ఆందోళనకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు